Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ సామర్థ్యం పెరగాలంటే.. పురుషులు మెంతులు తీసుకోవాల్సిందే

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకరకాల పదార్థాలను టేస్ట్ చేస్తున్నారా? అయితే వాటిని ఆపండి. మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శృం

ఆ సామర్థ్యం పెరగాలంటే.. పురుషులు మెంతులు తీసుకోవాల్సిందే
, శుక్రవారం, 2 జూన్ 2017 (12:00 IST)
శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా?  బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకరకాల పదార్థాలను టేస్ట్ చేస్తున్నారా? అయితే వాటిని ఆపండి. మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని ఆయుర్వద నిపుణులు అంటున్నారు. మెంతులు తీసుకోవడం ద్వారా ఆ విషయంలో కొత్త ఆశలు చిగురించక తప్పదని వారు చెప్తున్నారు. 
 
మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు ఇప్పటికే పరిశోధనలో తేలింది. కొందరికి ఆరు వారాల పాటు మెంతుల రసాన్ని ఇచ్చారు. వారిలో 82 శాతం మటుకు శృంగార శక్తి పెరిగిందని పరిశోధనలు తేల్చాయి. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.
 
ఇక చక్కెర వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయి. మెంతులు జీర్ణాశయ సంబంధ సమస్యలకు నివారిణిగా ఉపయోగిస్తారు. స్థూలకాయం, చెడు కొవ్వులు, మధుమేహం అదుపు చేసేందుకు మెంతులు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖంపై బ్లాక్, వైట్ హెడ్స్ తగ్గించడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగిస్తారు. జుట్టు పట్టుకుచ్చులా ఉండటానికి మెంతిపొడిని నానబెట్టి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ టీ తాగితే లాభాలని అంటారు... నిజమేనా?