వాముతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు వాములో ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, సి, ఇ, కెలతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్ఫరస్ తదితర పోషకాలు కూడా వాములో ఉంటాయి. అందువల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి వాము ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా వామును వేసి నీటిని బాగా మరగబెట్టాలి.
నీరు మరిగాక వడబోసి అందులో కొద్దిగా తేనె కలిపి వేడిగా ఉండగానే తాగేయాలి. ఈ వాము టీని తాగినా లేదా వామును తిన్నా హైబీపీ తగ్గుతుంది. బొంగురు పోయిన గొంతు సరి అవుతుంది. అలాగే జలుబు, దగ్గు వెంటనే తగ్గుతాయి. నిత్యం వాము టీని తాగితే డిప్రెషన్ తగ్గుతుంది.
వాములో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం వాము టీ తాగడం లేదా వాము తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.