Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సచిన్ టెండూల్కర్‌కి అదివ్వండి, నాకు రాగి జావ ఇవ్వండి, ఏం జరుగుతుందో చూడండి?

Advertiesment
సచిన్ టెండూల్కర్‌కి అదివ్వండి, నాకు రాగి జావ ఇవ్వండి, ఏం జరుగుతుందో చూడండి?
, సోమవారం, 4 మే 2020 (21:34 IST)
మార్కెట్లో శక్తిని పెంచేందుకు రకరకాల పిండి పదార్థాలు ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వాటిని పాలలో కలుపుకుని తాగి బలం శక్తి వస్తుందని అనుకుంటుంటాం. అలాగే క్యాల్షియం పెరుగుతుందని క్యాల్షియం మాత్రలు వేసుకుంటూ వుంటారు మరికొందరు. ఐతే ఓ రైతు ఏమంటున్నారంటే సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తికి మార్కెట్లో అమ్మే శక్తి పౌడర్లు ఇవ్వండి, నాకు మాత్రం రాగి జావ ఇవ్వండి, పది రోజుల పాటు ఇలాగే చేయండి. 
 
ఎవరు వేగంగా పరుగులు తీస్తారో చూడండి అంటూ సవాల్ విసురారు. ఆయన వేసిన సెటైర్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే ప్రకృతి సహజసిద్ధంగా దొరికేవాటిలో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ప్యాకెట్లలో వచ్చేవి నిల్వబెట్టి రసాయనాలు కలిపి చివరికి చేవలేని పదార్థాల్లో వస్తుంటాయి. కనుక క్యాల్షియం కావాలంటే రాగి జావ తప్పక తీసుకోవాలి. అందులో ఏమున్నాయో తెలుసుకుందాం.
 
రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉండే విటమిన్లు వయసు మీద పడకుండా చేస్తాయి. రాగులలో వుండే ఎమినో యాసిడ్స్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. శరీర బరువును నియంత్రిస్తాయి. దీనిలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. 
 
నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతుంది కాబట్టి ఈ రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా అవుతాయి. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకొనడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. 
 
అంతేగాక రాగులను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత అయోడిన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రాగులతో చేసిన ఏ ఆహారమైనా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. రాగుల జావ దప్పికను అరికడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 గ్రాముల మిరియాల పొడిని అలా చేసి రోజూ తాగితే...