Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలికాలంలో జలుబుకు చక్కని దివ్యౌషధం.. యూక‌లిప్ట‌స్ ఆయిల్

Advertiesment
చలికాలంలో జలుబుకు చక్కని దివ్యౌషధం.. యూక‌లిప్ట‌స్ ఆయిల్
, సోమవారం, 23 నవంబరు 2020 (22:52 IST)
eucalyptus oil
చలికాలంలో జలుబుకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ చక్కని దివ్యౌషధంగా పనిచేస్తుంది. నీల‌గిరి తైలం అని పిలువబడే ఈ తైలాన్ని జలుబుకు విరుగుడుగా వినియోగించుకోవచ్చు. ఈ ఆయిల్ మ‌న‌కు అనేక లాభాల‌ను ఇస్తుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో వేడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా నీల‌గిరి తైలం వేసి ఆపైన వ‌చ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే ఎంత‌టి జ‌లుబైనా త్వ‌ర‌గా త‌గ్గుతుంది. 
 
అలాగే ద‌గ్గు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర ఇత‌ర శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. శ‌రీరంలో నొప్పులు ఉన్న ప్ర‌దేశంలో నీల‌గిరి తైలం రాసి ఆయా భాగాల్లో వేడి నీటి కాప‌డం పెట్టాలి. దీంతో నొప్పుల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముఖ్యంగా ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్లు, కండ‌రాల నొప్పులు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. గోరు వెచ్చ‌ని నీరు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీల‌గిరి తైలం వేసి బాగా క‌లిపి దాంతో నోరు పుక్కిలించాలి. రోజూ ఇలా చేయ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న పోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. 
 
ఇకపోతే.. దుస్తులు ఉతికేట‌ప్పుడు కొద్దిగా నీల‌గిరి తైలం వేసి వాటిని ఉత‌కాలి. దీంతో దుస్తుల‌కు ప‌ట్టి ఉండే ఫంగ‌స్‌, ఇత‌ర క్రిములు నశిస్తాయి. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు క‌వ‌ర్లు త‌దిత‌ర ఇత‌ర వ‌స్త్రాల‌పై కూడా నీల‌గిరి తైలం చ‌ల్లుతుంటే అవి సువాస‌న వ‌స్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్ 19 చికిత్స కోసం ఫావిపిరావిర్‌