Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2020 సంవత్సర ఫలితాలు- మకరం రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Advertiesment
Yearly predictions
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (18:39 IST)
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6
 
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. కొత్త బంధుత్వాలు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలు అనుకూలిస్తాయి. ధనసహాయం తగదు. పదవులు దక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. తరుచూ వ్యవహారాల్లో పాల్గొనవలసి వస్తుంది.

పరిచయస్తులు మీ సహాయ సహకారాలు ఆశిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంస్థల స్థాపనలు, నూతన వ్యాపారాలకు అనుకూలం. స్థలం, గృహమార్పు కలిసివస్తాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు.

విదేశీ విద్యావకాశం లభించకపోవచ్చు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్వయంకృషితో రాణిస్తారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. అధికారులకు హోదామార్పు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. 
 
ఉత్తరాషాఢ నక్షత్రం వారు పుచ్చుకెంపు, శ్రవణానక్షత్రం వారు మంచిముత్యం, ధనిష్ట నక్షత్రం వారు తెల్ల పగడం ధరించినట్లైతే శుభం కలుగుతుంది. ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగగలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2020 సంవత్సర ఫలితాలు- తులారాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?