మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో మితంగా సంభాషించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. గృహమార్పు యత్నాలు సాగిస్తారు. పాతమిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. ఆసక్తికరమైన సంఘటనలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. పదోన్నతులు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. వృత్తుల వారికి నిరాశాజనకం.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. శ్రమాధిక్యతతో విజయం సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు, వస్తువులు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. గురువారం నాడు పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్కంఠత కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రియతములతో సంభాషిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. అధికారులకు అదనపు బాధ్యతలు. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా చక్యబడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషణ ఉత్సహాన్నిస్తుంది. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాల్లో నిపుణుల సలహా పాటించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. రుణ సమస్యలు వేధిసాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. పాత పరిచయస్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు అప్రియమైన వార్త వినవనలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ద్విచక్రవాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళ కలిగిస్తాయి. రావలసిన ధనాన్ని సౌమ్మంగా రాబట్టుకోవాలి. సన్నిహితుల ప్రోద్బలంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి శుభయోగం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. ముఖ్యమైన పనులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళుకువ వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు అందుతాయి. నిర్మాణాలు, ప్రాజెక్టులు చురుకుగా సాగుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. పనులు సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ కించపరచవద్దు. మంగళవారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అందరితోను మితంగా సంభాషించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వాహనదారులకు దూకుడు తగదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిస్థితులు మెరుగపడతాయి. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. గురువారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. కష్టమనుకున్న సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు మంచి ఫలితాలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. శుక్ర, శనివారాల్లో సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మస్థైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. యత్నాలు కొనసాగించండి. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వ్యాపారాలు ఉపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.