Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14.01.2024 నుంచి 20.01.2024 వరకు మీ వార రాశిఫలితాలు

Advertiesment
weekly astrology

రామన్

, శనివారం, 13 జనవరి 2024 (19:25 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం సంతోషదాయకం. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు పదవీయోగం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ అశక్తతను అయిన వారు అర్ధం చేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు నిరాశాజనకం. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకకు హాజరవుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథు : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సోమ, మంగళవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. బుధవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం దూకుడు కట్టడి చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గృహమార్పు కలిసి వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆకస్మిక ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆప్తులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కీలక పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు బాధ్యతల మార్పు. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
మీదైన రంగంలో పురోగమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. మీ ఆలోచనలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పత్రాల్లో స్వల్ప సవరణలు అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆది, సోమవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. స్థామతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోకపరణాలు మరమ్మతుకు గురవుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
అనుకూలతలున్నాయి. మాట నిలబెట్టుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వస్తులాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళవారం నాడు నగదు చెల్లింపులు తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు పనిభారం. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. పాతమిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉన్నతాధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు ఖరీదైన కానుకలిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. గురు, శుక్రవారాల్లో ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాలకు అనుకూలం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడ్డారు. ఖర్చులు సంతృప్తికరం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం కళకళలాడుతుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పాతమిత్రులు తారసపడతారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు. పందాలు, పోటీల్లో రాణిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-01-2024 శనివారం దినఫలాలు - ఆంజనేయస్వామి దండకం చదివినా లేక విన్నా శుభం...