Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-02-2020 నుంచి 15-02-2020 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Advertiesment
09-02-2020 నుంచి 15-02-2020 వరకు మీ వార రాశి ఫలితాలు (video)
, శనివారం, 8 ఫిబ్రవరి 2020 (18:42 IST)
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం  
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయం లేనివారితో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. తప్పుదారి పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. దీర్ఘకాలిక సమస్యలు సద్దుమణగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపకాలు సృష్టించుకోండి. సన్నిహితులతో గడిపేందుకు ప్రయత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మంగళ, బుధవారాల్లో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. గురువారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. విందులు వేడుకల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
పరిచయాలు బలపడతాయి. వేడుకలకు హాజరవుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అవకాశాలను తక్షణం వినియోగంచుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహమార్పు చికాకు పరుస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. శుక్ర, శనివారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలకు విశ్వసించవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం.  ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విద్యార్థులకు ఒత్తిడి, ఏకాగ్రత లోపం, కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
గృహమార్పు కలిసివస్తుంది. పదవుల కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సోమ, మంగళవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం చదువులపై మరింక శ్రద్ధ వహించాలి. పెట్టుబడులకు అనుకూలం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు   
బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కార్యసాధనలో జయం, ధనప్రాప్తి ఉన్నాయి. నిజాయితీని చాటుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. బుధవారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. నూతన వ్యాపారాలకు అనుకూలం. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ  
ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది వుండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. గురు, శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మనోధైర్యంతో వ్యవహరించండి. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు బాధ్యతల మార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కుటుంబ విషయాలు ఏకరువు పెట్టొద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. సన్నిహితుల సలహా పాటించండి. శనివారం ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఆత్మీయుల సాయం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. యత్నాలు కొనసాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అవసరాలు అతికష్టంమీద నెరవేరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయుల కలయిక కుదుటపడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆది, సోమవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
ఈ వారం వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆత్మయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. దైవదర్శనం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. అనుకోని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల్లో శ్రమ, ఒత్తిడి అధికం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకలకు హాజరవుతారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. ప్రయాణం సజావుగా సాగుతుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-02-2020 శనివారం దినఫలాలు - శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించినా...