Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

08-02-2020 శనివారం దినఫలాలు - శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించినా...

webdunia
  • facebook
  • twitter
  • whatsapp
share
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (04:00 IST)
Astrology
మేషం : రాజకీయ రంగాల్లో వారికి ఒత్తిడి, కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యగోస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అనుకున్న పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. 
 
వృషభం : ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ముఖ్యుల వైఖరి మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎంతటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. 
 
మిథునం : మీ పనితీరు, వాగ్ధాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలనిస్తాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. రాబడికి తగిన వ్యయం ఉడటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీవుండదు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదావేయడం మంచిది. 
 
కర్కాటకం : దైవకార్యాలు, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. 
 
సింహం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ సంతనాం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. క్రయ, విక్రయాలు ఊపందుకుంటాయి. 
 
కన్య : విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. కొత్త నిర్ణయాలు అనుకూలిస్తాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. స్టాక్ మార్కెట్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. 
 
తుల : మీ శ్రీమతిలో వచ్చిన మార్పు మీకెతో సంతృప్తినిస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపారాల విస్తరణకు సంబంధించిన అంశాలు ఒక కొలిక్కి రాగలవు. 
 
వృశ్చికం : వైద్యులు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. పుణ్యక్షేత్రాలు, సందర్శిస్తారు. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. గత కొంతకాలంగా ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. 
 
ధనస్సు : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లడంతో ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించడం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. బంధు మిత్రులతో ప్రేమానబంధాలు బసపడతాయి. 
 
మకరం : ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. నిర్మాణ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. బంగారు, వెండి లోహ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కుంభం : విద్యార్థులకు ఒత్తిడి అధికం. అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, ఇతర వ్యాపకాలు అధికం కావడంతో చికాకులు తప్పవు. 
 
మీనం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:
  • facebook
  • twitter
  • whatsapp

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

webdunia
జమ్మూ - వారణాసిలో శ్రీవారి ఆలయాలు