Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-04-2023 నుంచి 06-05-2023 వరకు వార ఫలితాలు

Weekly astrology
, శనివారం, 29 ఏప్రియల్ 2023 (19:52 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. మనోధైర్యంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆహ్వానం అందుకుంటారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బుందులుండవు. రిటైర్డు ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదములు
ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది పెద్దల సలహా పాటించండి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. పరిచయాలు బలపడతాయి. యోగ, ఆధ్యాత్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. విద్యార్థులకు సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహం మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతికి సలహా పాటిచండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. గృహమార్పు అనివార్యం. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగవవంతమవుతాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. సంకల్పం నెరవేరుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. హామీలు నిలబెట్టుకుంటారు. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వాస్తుదోష నివారణ చర్యలు ఫలిస్తాయి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. బుధవారం నాడు పనులు సాగవు. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదా మార్పు. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. గృహమరమ్మతులు చేపడతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు హోదామార్పు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు నిరాశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మంగళవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం ఉన్నత చదవులను వారి ఇష్టానికే వదిలేయండి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. గృహమార్పు ఆశించిన ఫలితమిస్తుంది. అస్వస్థతకు గురవుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chaturgrahi Yog 2023.. ఈ రాశులకు లాభం.. స్వాతి, తులారాశి వారికి?