Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
Weekly Horoscope

రామన్

, శనివారం, 28 జూన్ 2025 (16:29 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటారు. పరిచయాలు మరింత బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బుధవారం నాడు నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కీలక వ్యవహారంలో ఒత్తిడికి గురికావద్దు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రేమ వ్యవహారం వివాదాస్పదమవుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారాల జోలికి పోవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తారు. ఆశావహదృక్పధంతో ఉద్యోగయత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. ధృఢసంకల్పంతో శ్రమించండి. మీ కృషి ఫలించే రోజు దగ్గర్లోనే ఉంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి, రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను నమ్మవద్దు. పరిచయస్తులో మోసగిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. చేపట్టి పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తంలో సరుకు నిల్వ తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
సత్కాలం నడుస్తోంది. అవకాశాలు కలిసివస్తాయి. నిజాయితీని చాటుకుంటారు. ఆపత్సయంలో సన్నిహితులు ఆదుకుంటారు. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు శ్రేయస్కరం కాదు. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా భావిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఏకాగ్రతతో ఉద్యోగ విధులు నిర్వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, ఆకాలభోజనం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి.. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగ పరంగా మంచి ఫలితాలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య, రవాణా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగుల జోలికి పోవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. కొత్తపనులకు ప్రణాళికలు వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సోమవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధసేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదావకాశం లభిస్తుంది. మార్కెట్ రంగాల వారు లక్ష్యాన్ని అధిగమిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి, ధనం మితంగా ఖర్చుచేయండి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహమార్పు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కష్టసమయంలో సహోద్యోగులు సాయం చేస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో శ్రమిస్తే కార్యం సిద్ధిస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. హామీలు, ఒప్పందాల విషయంలో తొందరపడవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నగదు, కీలక పత్రాలు జాగ్రత్త. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ విధుల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థోమతును తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. శుక్రవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. చిన్నవ్యాపారులకు నిరాశాజనకం. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది, పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్షం మీకు సమస్యాత్మకమవుతుంది. ఆప్తుల సాయంతో సమస్య సద్దుమణుగుతుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. మీ సమర్థతపై ఎదుటివారికి గురికుదురుతుంది. లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోగయోగ్యమవుతుంది. ఆర్భాటాలకు విపతంగా ఖర్చుచేస్తారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కీలక విషయాలపై దృష్టిపెట్టండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు మొదలు పెడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. సాంకేతిక, సేవా రంగాల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...