మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం కొంతమేరకు అనుకూలం. పరిస్థితులు చక్కబడతాయి. మీ ఆశయ సాధనకు అనువైన సమయం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆప్తులతో తరచుగా సంభాషిస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నూతన పెట్టుబడులు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి.
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. దీక్షతో యత్నాలు సాగించండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. కొన్ని పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పధంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాభివృద్ధికి అనుభవజ్ఞుల సలహా పాటించండి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు మీ పనితీరు సంతృప్తినిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు.
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, అకాలభోజనం. రావలసిన ధనం నిదానంగా అందుతుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. లక్ష్యాన్ని సాధించటానికి అనుకూల సమయం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధ సేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. చేపట్టిన ప్రతి పని అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహార లావాదేవీలతో సతమతమవుతారు. ప్రతి విషయం స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సలహాతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి.
సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. రావలసిన ధనం సమయానికి అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దూరప్రయాణం తలపెడతారు.
కన్య రాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
బుద్ధిబలంతో యత్నాలు సాగించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సమష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. ప్రతికూలతలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు నియంత్రించుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురైనా ఎట్టకేలకు పూర్తి కాగలవు. మీ ప్రమేయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష ధోరణి తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు నిరాశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు.
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి యోగదాయకమే. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. సన్నిహితులతోతరచు సంభాషిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం సఫలమవుతుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు, పొదుపు పథకాలు, నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు, సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. అపజయాలకు దీటుగా స్పందిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు నియంత్రించుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కొత్త పనులకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. కొన్ని సందర్భాల్లో అకారణంగా మాటపడవలసి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం.
ధనుస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. అవకాశాలను దక్కించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరచరాస్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మకరరాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో శ్రమించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. సోదరీ సోదరులతో ఒక అవగాహనకు రాగలుగుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సంక్లిష్ట సమయం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గతం కంటే అనుకూలదాయకం. అభీష్టం నెరవేరుతుంది. లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. చేపట్టిన ప్రతి పనీ విజయవంతమవుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపునకు అవకాశం లేదు. దంపతుల మధ్య తరచు కలహాలు. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. సంతానికి ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలతలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయన వస్తువుల లభ్యమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రదోన్నతికి అధికారులు తోడ్పాటునందిస్తారు.