మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రతికూలతలు అధికం. సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కొన్ని పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. సన్నిహితుల ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. వ్యాపాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పరస్సరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అవేశాలకు లోనుకావద్దు. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలాభసాటిగా సాగుతాయి.. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు.
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూల సమయం. ఏ కార్యక్రమం మొదలెట్టినా విజయవంతమవుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం కలిసివచ్చే కాలం. బుద్ధిబలంతో లక్ష్యం సాధిస్తారు. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. రాని బాకీలు వసూలు కాగలవు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు.
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహబలం స్వల్ప అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. పెద్దల సలహా పాటించండి. ఒంటెద్దు పోకడ తగదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. కొత్త పనులు చేపడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. ధృఢసంకల్పంతో వ్యవహరించండి. మీదైన రంగంలో బుద్ధిబలంతో శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. మనోధైర్యాన్ని తగ్గించే విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. న్యాయ, వైద్య, సాంకేతిక వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వాయిదాల చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటింంచండి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తులకు పదవీయోగం, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులేయండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభసమయం సమీపిస్తోంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అవివాహితులకు శుభయోగం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. పెద్దల సలహా పాటించండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వృత్తి ఉద్యోగాల్లో విశేష ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సాఫ్ట్‌వేర్ రంగ విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో విశేష ఫలితాలున్నాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయ. వ్యూహాత్మకంగా అడుగులేయండి. సమయస్ఫూర్తితో రావలసిన ధనం వసూలు చేసుకోవాలి. ఆత్మీయుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివవ్వద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఒక నష్టాన్ని మరోవిధంగా భర్తీ చేసుకుంటారు.
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌ను అలక్ష్యం తగదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాల కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సరుకు నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం ప్రథమార్థం అనుకూలం కాదు. కీలక అంశాల్లో ఉత్సాహం తగ్గకుండా మెలగండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా ఖర్చు చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికి చికాకుపడతారు. ఆత్మీయుల హితవు మీపై సత్ ప్రభావ చూపుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాక్చాతుర్యంతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. అధికారులకు అదనపు బాధ్యతలు. ఏకాగ్రతతో వాహనం నడపండి.