Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

02-06-2024 నుంచి 08-06-2024 వరకు మీ వార ఫలితాలు

weekly astro

రామన్

, శనివారం, 1 జూన్ 2024 (14:21 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాలస్థితి అనుకూలంగా ఉంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు, పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహనిర్మాణాలు ఊపందుకుంటాయి. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బాధ్యతల మార్పు. ఉన్నతాధికారులకు కష్టసమయం. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకల్లో దూకుడు తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
శుభసమయం సమీపిస్తోంది. నిరుత్సాహం వీడి ఉత్సాహంగా అడుగులేయండి. మీ కృషి ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. ముఖ్యుమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ఆదివారం నాడు కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు హోదా మార్పు. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
మీ కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. యత్నాలు కొనసాగించండి. అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. బుధవారం వారాల్లో దంపతుల కలహాలు, చికాకులు. సామరస్యంగా మెలగండి. సంతానానికి శుభం జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. శుక్రవారం నాడు ఆచితూచి అడుగేయాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికి తగదు. సంతానంపై చదువులపై దృష్టి సారిస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోబలం పెంపొందుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. శనివారం నాడు పనులు సాగవు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు శుభయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆపన్నులకు సాయం అందిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు స్థానచలనం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా యత్నాలు సాగించండి పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మీ కృషి ఫలించే రోజు త్వరలోనే ఉంది. ఖర్చులు అధికం. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహమారు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఏకాగ్రత, కృషి ప్రధానం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ముఖ్యులకు ఘనస్వాగతం పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. కీలక పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. పట్టింపులకు పోవద్దు. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయిన వారితో సంభాషిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితాలీయవు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ప్రధానం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించి సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహరం ధనంతో ముడిపడి ఉంటుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. సోమ, మంగళవారాల్లో ఊహించని ఈ సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
మీన : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆరోగ్యం బాగుంటుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. బుధవారం కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-06-2024 నుంచి 30-06-2024 వరకు ఫలితాలు