Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-09-2021 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజించినా...

Advertiesment
07-09-2021 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజించినా...
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పూర్తికావు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంది. 
 
వృషభం : దైవ, పుణ్యకార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వస్త్రములు, అకలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. ముఖ్యులలో ఒకరి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం : ప్రైవేటు సంస్థలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగుల నిర్లప్తత ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. సిమెంట్, ఐరన్, కలప, ఇటుకు వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు అధికారుల పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. విద్యార్థులకు క్రీడలు, ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఖర్చులు అధికమైనా సంతృప్తి ప్రయోజనం పొందుతారు. 
 
సింహం : కృషి పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. బిల్లులు చెల్లింపుల విషయంలో చిక్కులు ఎదురవుతాయి. 
 
కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉండగలదు. ఆంతరంగిక వ్యాపారాల విషయాలు గోప్యంగా ఉంచండి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తివచ్చు. 
 
తుల : ఒంటెత్తు పోకడ మంచిదికాదు అని గమనించండి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహ మరమ్మతులు, మార్పులు, వాయిదా వేయడం శ్రేయస్కరం. రుణం ఏ కొంతైనా తీర్చడానికి చేసే మీ యత్న వాయిదాపడుతుంది. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, సమర్థంగా నిర్వహిస్తారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : సంఘంలో పకులుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మీదే పైచేయిగా ఉంటుంది. స్త్రీలకు అలసట అధిక శ్రమ తప్పదు. ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. అపరాలు, ధాన్య వ్యాపారస్తులకు స్టాకిస్టులకు ఆశాజనకం. 
 
మకరం : నిరుద్యోగులకు దూర ప్రాణాల నుంచి సదావకాశాలు లభిస్తాయి. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి యత్నిస్తారు. జాగ్రత్త వహించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరింకొంతకాలం వాయిదా వేయడం మంచిది. వ్యవసాయ రంగంలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
కుంభం : విద్యా సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు బిడియం అభిమానం కూడదు. బాధ్యతలు మిమ్మలను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఆడిటర్లకు మతిమరుపు తగ్గుట వల్ల ఆందోళన పెరుగుతుంది. వాగ్వివాదాలకు సరైన సమయం కాదని గమనించండి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మీనం : వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి పొందుతారు. అనుకున్నది సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టం. రాజకీయ, కళా రంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. హామీలకు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-09-2021 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధించినా...