Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-09-2021 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధించినా...

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులతో మితంగా సంభాషించండి. రుణవాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు అనురాగ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యంగా, ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన యత్నాల్లో పురోభివృద్ధి. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, రాణింపు, ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు వస్తువుల పట్ల దైవ కార్యముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం : నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు పానీయ కూరగాయల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బంధువులు మధ్య సయోధ్య నెలకొంటుంది. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందడంతో పాటు తోటి విద్యార్థులతో పోటీపడతారు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : అనుకోని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. 
 
సింహం : రిప్రజెంటేటివ్‌లు తమ లక్ష్యాలను అధికమిస్తారు. కష్ట సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. కొంతమంది మీ ఛతురోక్తులకు తీవ్రంగా స్పందించే ఆస్కారంవుంది. దైవ, సేవా, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. జాయింట్ వెంచర్ వ్యాపారస్తులకు పరస్పర అవగాహన లోపం వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారంవుంది. 
 
కన్య : కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. హామీలకు సంబంధించిన విషయాల్లో మెళకువ వహించండి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి సంతృప్తి. పురోభివృద్ధి కానవస్తుంది. విందులు, వినోదాల్లో పలువురిని ఆకట్టుకుంటారు. స్త్రీలతో అతిగా సంభాషించడం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. 
 
తుల : ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. అయినవారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. రహస్యాన్ని దాచలేని మీ బలహీనత ఇబ్బంది కలిగిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. కళ, క్రీడా సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. క్రయ, విక్రయాలు సామాన్యం. 
 
ధనస్సు : వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని విషయాలు చూసిచూడనట్టు వదిలేయండి. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువు చేజార్చుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు, చిన్ననాటి పరిచయస్తులకు కలుసుకుంటారు. దుబారా ఖర్చులు అధికం. 
 
మకరం : ప్రైవేటు సంస్థల్లోని వారికి అంకితభావం ఎంతో ముఖ్యం. వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. మీ శ్రీమతితో విభేదించడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ధనసహాయం, ఖర్చుల విషయాల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థినులలో ఏకాగ్రతా లోపం వల్ల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కుంభం : ధనం, వస్తువులపై అధిక ఆపేక్ష వల్ల బంధు మిత్రులకు దూరమయ్యే అవకాశం వుంది. జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సౌఖ్యం, సోదరుల నుంచి ఆదరణ పొందుతారు. 
 
మీనం : దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. అధికారులకు హోదా మార్పు, స్థానచనం సంభవం. భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరగడంతో ఒడిదుడుకులు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-09-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుడిని పూజించినా...