Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-05-22 బుధవారం రాశిఫలాలు ... సత్యదేవుని పూజించి అర్చించినా..

Advertiesment
astro11
, బుధవారం, 18 మే 2022 (04:00 IST)
మేషం :- సాహస ప్రయత్నాలు విరమించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. రాబడికి మంచిన ఖర్చుల వల్ల చేబదుళ్ళు, రుణయత్నాలు సాగిస్తారు. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తరుచు సభలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చికాకు పరుస్తాయి.
 
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి వల్ల మాటపడక తప్పదు. ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది.
 
మిథునం :- ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రాబడికి మించిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్ల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
 
సింహం :- మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
 
కన్య :- ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం ధోరణి చికాకు పరుస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శక్తిసామర్థ్యాలపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది.
 
తుల :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎంత శ్రమించినా సామాన్య ఫలితాలే పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు.
 
వృశ్చికం :- అవత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం, తల పెట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం.
 
ధనస్సు :- వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గతంలో వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మకరం :- బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీపట్టుదల నెరవేరుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సాహసించి మీరు తీసుకున్న ఒక నిర్ణయం సత్ఫలితాలిస్తుంది.
 
మీనం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. రావలసిన ధనం అందకపోవటంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-05-22 మంగళవారం రాశిఫలాలు ... మహాలక్ష్మీని ఎర్రని పూలతో పూజించిన...