Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-05-22 శుక్రవారం రాశిఫలాలు .. లక్ష్మీ కుబేరుడిని ఆరాధించిన...

Advertiesment
astro5
, శుక్రవారం, 13 మే 2022 (04:00 IST)
మేషం :- ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు సామాన్యం. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది.
 
వృషభం :- వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
మిథునం :- వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించటంతో పాటు అనుభవం గడిస్తారు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. నిర్మాణ పనులలో సంతృప్తి కానవస్తుంది. విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం :- శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి.
 
సింహం :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు శుభదాయకం. నిరుద్యోగులకు ఒక సమాచారం ఆలస్యంగా అందటంతో నిరుత్సాహానికి గురవుతారు. దూరప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాలలో మెలకువ వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.
 
కన్య :- వృత్తుల్లో వారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు అతి ఉత్సాహం చూపించటం వల్ల మాట పడక తప్పదు. కాంట్రాక్టర్లకు సదావకాశాలు లభిస్తాయి. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. నిరుద్యోగులు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.
 
తుల :- కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. ప్రయాణాల్లో ఒకింత నిరుత్సాహం తప్పదు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించటానికి యత్నిస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ప్రియతముల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
వృశ్చికం :- విద్యార్థినులకు తోటివారి కారణంగా ఇబ్బందులు తప్పవు. నూతన ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు, విదేశీయానం అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటవారి ద్వారా శుభవార్తలు వింటారు. స్త్రీలకు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహరాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. విద్యార్ధులకు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుంది. పాత బిల్లులు చెల్లిస్తారు. పాత మిత్రులు, ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం వంటి శుభసూచకాలున్నాయి.
 
మకరం :- ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరించటం వల్ల క్షణం తీరిక ఉండదు. మీ సంతానం విద్యా విషయాల పట్ల సంతృప్తి చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ప్రతికూలత లెదుర్కుంటారు.
 
కుంభం :- మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలం. కిరణా, ఫ్యాన్సీ నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆశాజనకం.
 
మీనం :- ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులు చేపట్టిన పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-05-22 గురువారం రాశిఫలాలు .. సాయిబాబాను ఆరాధించిన మీ సంకల్పం...