శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| ఏకాదశి తె.3.44 ఆరుద్ర రా.8.02 ఉ.శే.వ.6.04 కు ఉ.దు. 9.58 ల 10.49 ప.దు. 3.05 ల3.57
మేషం :- వాతావరణంలో మార్పు వ్యవసాయదారులకు ఎంతో సంతృప్తినిస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ముఖ్యులతో ఆకస్మిక అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ఆడిటర్లకు చికాకులు తప్పవు. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు నిరుత్సాహంతప్పదు.
వృషభం :- కీలకమైన వ్యవహరాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం క్షేమదాయకం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అతి కష్టంమ్మీద పూర్తి చేస్తారు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు.
మిథునం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళుకువ వహించండి. చిట్స్, ఫైనాన్సు సంస్థల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యం, సోదరుల నుండి ఆదరణ పొందుతారు.
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. రాబడికి మించిన ఖర్చులు అందోళన కలిగిస్తాయి. ధనవ్యయం అధికమైనా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. సోదరులతో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు.
సింహం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం కుదుటపడుతుంది.
కన్య :- గత కొంతకాలంగా ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం కాగలవు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. విలువైన పత్రాలు, వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. సాహిత్య, కళారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సభలు, సన్మానాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
తుల :- మీ ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. యూనియన్ వ్యవహారాలు, అధికారులతోచర్చలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు జయం, వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. వ్యవసాయ రంగాల వారికి చికాకులు అధికం. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునరాలోచన అవసరం.
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒత్తిడికి గురవుతారు. ఉపాధ్యాయులకు కొత్తసమస్యలు ఎదురవుతాయి. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు :- రవాణా, ప్రయాణ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి క్రమంగా నిలదొక్కుకుంటారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు.
మకరం :- మీ శ్రీమతి గొంతెమ్మ కోరికలు ఇరకాటానికి గురి చేస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. క్రీడ, కళాకారులకు ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తివివాదాలు ఎంతకీ పరిష్కారం కాక విసుగుచెందుతారు.
కుంభం :- ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల నిర్వహణలో అధికారులు, తోటివారి సహకారం అందుతుంది. ఆరోగ్యం, ఆహార విషయాల్లో జాగ్రత్త వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి.
మీనం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఉన్నతాధికారుల హోదా పెరగటంతో పాటు స్థానచలనం ఉంటుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. పాత రుణాలు తీరుస్తారు.