Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేదీ 29-01-2023 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణం చేసినా...

Advertiesment
Aries
, ఆదివారం, 29 జనవరి 2023 (04:02 IST)
మేషం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం :- ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పడికి వాటిని సద్వినియోగం చేసుకొలేకపొతారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
మిథునం :- రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహరాలు, సంప్రదింపులతో క్షణం తీరిక ఉండదు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం :- ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పందేలు, జూదాల వల్ల ఇరకాటంలో పడతారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
సింహం :- ఊహించని ఖర్చులు, విద్యుత్ బిల్లులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
కన్య :- ఆర్థికంగా వెనుకపడతారు. సహోద్యోగులకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ప్రయాణాలలో చికాకులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు నూతనోత్సాహం కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు వస్తు, వస్త్ర, ఆభరణాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.ఆలయాలను సందర్శిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- రవాణా, ప్రకటనలు, విద్యా రంగంలోని వారికి శుభప్రదం. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏ మాత్రం నిలువ చేయలేక పోతారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు బోగ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 
 
ధనస్సు :- ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రంనిల్వ చేయలేకపోతారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తుతాయి. కిరాణా వ్యాపారులకు సామాన్యంగా ఉండగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
 
మకరం :- రావలసిన ధనం వాయిదా పడుతుంది. బంధువులు రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. సన్నిహితులతో కలియి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికైచేయు యత్నాలు ఫలిస్తాయి. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారంఉంది.
 
కుంభం :- శాస్త్ర సంబంధమైన విషయాలు ఆసక్తిని చూపుతాయి. రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. కొబ్బరి, పూలు, పండ్లు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పూర్వపు అప్పులు కొన్ని తీర్చెదరు. మీ సంతానం ప్రేమ వ్యవహారాలలో పునరాలోచన అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-01-2023 నుంచి 04-02-2023 వరకు మీ వార రాశిఫలాలు