Publish Date: Thu, 28 May 2026 (04:00 IST)
Updated Date: Wed, 27 May 2026 (20:18 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా చేసుకుంటారు. ఒత్తిడికి గురికావద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పసులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషి ఫలిస్తుంది.
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ, వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. కొత్తపరిచయాలేర్పడతాయి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు, సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పత్రాల రెన్యువల్, చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. పనుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం, ఆచితూచి అడుగేయండి. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. కార్యసిద్ధి వ్యవహార జయం ఉన్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలను, విపరీతంగా ఖర్చు చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు ఇతరులకు పురమాయించవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్య సాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. న్యాయం అశించవద్దు, రవాణా ఖర్చులు తగ్గించుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. మీ విషయాల్లో ఇతరులు జోక్యానికి అవకాశమివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం తగదు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. మీ కృషి ప్రధానంగా ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్ధికంగా బాగున్నా ధనం మితంగా ఖర్చు చేయండి. ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. చేపట్టిన పనులపై శ్రద్ద వహించండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి.