Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28-03-2024 గురువారం దినఫలాలు - అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు...

astro4

వరుణ్

, గురువారం, 28 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| తదియ సా.4.26 స్వాతి సా. 4.29 రా.వ.10.24 ల 12.05. ఉ.దు. 10.13 ల 11.00 ప.దు. 2.55 ల3.42.
 
మేషం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. 
 
వృషభం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సాహిత్య, సన్మాన సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి చికాకు, ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. యువకులకు వేడుకల్లో అత్యుత్సాహంతగదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య, ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది.
 
సింహం :- ప్రైవేట్ సంస్థలల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం.
 
కన్య :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. బంధువుల రాకతో పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యూటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి.
 
తుల :- వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు తప్పవు. అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్త అవసరం.
 
వృశ్చికం :- మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల కలయిక వలన మీలో ఉత్తేజం కానరాగలదు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
 
ధనస్సు :- బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెళకువ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం :- కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం. వస్త్ర, పీచు, కళంకారి, బంగారు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాలలో వారికి మిశ్రమ ఫలితం.
 
కుంభం :- చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. రుణాలు తీర్చడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
 
మీనం :- ఆర్థికలావాదేవీల పట్ల ఏకాగ్రత వహించండి. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. విద్యార్ధుల ప్రేమ వ్యవహారం ఇబ్బందికి దారితీస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచనమంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టు చీరలు.. వెండి చీరలను ఎందుకు ధరిస్తారంటే?