Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-03-2023 తేదీ శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం...

Advertiesment
Aquarius
, శనివారం, 25 మార్చి 2023 (04:00 IST)
మేషం :- ఆడిటర్లు, అక్కౌంట్స్, ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు సమయం కలిసివస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం గ్రహిస్తారు. 
 
వృషభం :- స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. హామీలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో సమయస్ఫూర్తి అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
 
మిథునం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రయత్న పూర్వకంగా బాకీలు వసూలు కాగలవు. చెల్లని చెక్కులతో ఇబ్బందులెదుర్కొంటారు. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుంది. 
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహరాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడర్లకు చికాకులు తప్పవు. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటంవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
సింహం :- ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయంలో సమస్య లెదుర్కుంటారు. రాజకీయనాయకులకు కార్యకర్తలతో సమస్యలు తప్పవు. స్త్రీలు వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో శ్రమించిన కొలది ప్రతిఫలం లభిస్తుంది. 
 
కన్య :- స్త్రీలకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్ధులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగల్గుతారు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
తుల :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి.
 
వృశ్చికం :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో తలెత్తిన వివాదాలు సమసిపోగలవు. పత్రికాసిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
ధనస్సు :- శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
మకరం :- బంధువులను కలుసుకుంటారు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత, మెలకువ అవసరం. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. ఆశలొదిలేసుకున్న బకాయిలు వసూలు కాగలవు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.
 
కుంభం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రాజకీయనాయకులకు చర్చల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-03-2023 శుక్రవారం మీ రాశిఫలాలు - దుర్గా అమ్మవారిని పూజించిన...