Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-03-2023 తేదీ గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి...

Advertiesment
Aquarius
, గురువారం, 23 మార్చి 2023 (09:04 IST)
మేషం :- గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తగలవు. ఆలయాలను సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాట పడక తప్పదు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. సోదరీ సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. 
 
మిథునం :- ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా పుంజుకుంటుంది. మీ శ్రీమతి నుంచి అందిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆందోళన తప్పదు. స్త్రీలకు కొనుగోళ్ళ విషయాల్లో అప్రమత్తత అవసరం. మీ సంతానం వైఖరి వల్ల మనశ్సాంతిని కోల్పోతారు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడే సూచనలున్నాయి.
 
కర్కాటకం :- గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మార్పులు అనివార్యమయ్యే సూచనలు ఉంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీడియా రంగాలవారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు.
 
కన్య :- ఓర్పు, పట్టుదలతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. వాతావరణంలో మార్పువల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు. బాకీలు, ఇంటి అద్దెలు ఇతరత్రా రావలసిన ఆదాయం సకాలంలో అందుతాయి. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.
 
తుల :- ఉద్యోగస్తులు క్రిందిస్థాయి పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విద్యార్థులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆరోగ్యంలో మెళుకువ అసవరం. మీ మనసు మార్పును కోరుకుంటుంది. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. 
 
వృశ్చికం :- శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల వల్ల హాని కలిగే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రతా సమస్యలెదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యంలోస్వల్ప ఇబ్బందులు తలెత్తిన సమసిపోతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కొత్తవ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
మకరం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదు. మీరంటే గిట్టని వ్యక్తులు మీకు దగ్గర య్యేందుకు యత్నిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక, సొంత వ్యాపారాలుసంతృప్తికరంగా సాగుతాయి.
 
కుంభం :- వృత్తినైపుణ్యం పెంచుకునేందుకు కృషిచేయటం ఎంతైనా అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విలువైన గృహోపకరణాలు ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు.
 
మీనం :- మీ గౌరవ, ఆత్మాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. కార్యసాధనలో మొండి ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో లౌక్యం, ఏకాగ్రత అవసరం. రిప్రజెంటేటివ్లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట తప్పవు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతికి నలుపు దారం ఎలా కట్టాలో తెలుసా?