Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

Advertiesment
astro12

రామన్

, సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణవిముకులై. తాకట్టు విడిపించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. మీ శ్రీమతి వైఖరిలో మంచి మార్పు వస్తుంది. వివాహయత్నాలు సాగిస్తారు. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ఖర్చులు అధికం. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలు మెదలెడతారు. ద్విచక్ర వాహనదారులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చిన్న విషయానికే చికాకుపడతారు. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఆప్తుల కలయిక వీలుపడదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు చేరువవుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అస్వస్థతకు గురవుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. ఒత్తిళ్లకు గురికావద్దు. పట్టుదలతో శ్రమిస్తారు. ధనసహాయం తగదు. చేపట్టిన పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్దల హితవు మీపై చక్కగా పనిచేస్తుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి