Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-10-2022 సోమవారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సర్వదా శుభం..

Advertiesment
lord ganesh
, సోమవారం, 17 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లలో పునరాలోచన అవసరం. 
 
వృషభం :- ముఖ్యంగా మీ తాహతుకు మించి ఖర్చుచేయకండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించు కుంటారు. స్త్రీల ఏమరుపాటు వల్ల ఇబ్బందులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. బంధువుల కోసం బాగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులకు ప్రశాంతత, నిశ్చింత నెలకొంటాయి. పత్రిక, వార్తా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రదేశంలో ఉన్న మీ సంతానం రాక కోసం ఎదురుచూస్తారు. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. గత తప్పిదాలు పునరావృతంకాకుండా తగు జాగ్రత్త వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనచోదకులకు జరిమానాలు కట్టవలసివస్తుంది. అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కన్య :- చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. పాత మొండి బాకీలు తీరుస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
తుల :- కొబ్బరి,పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన ధనం అందక పోవడంతో ఒక్కింత నిరుత్సాహం తప్పదు. ప్రింటింగ్ పని వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఒక వ్యవహారంలో సోదరుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసివస్తుంది. 
 
వృశ్చికం :- రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల వ్యాఖ్యలు అనుక్షణం జ్ఞప్తికి వస్తాయి. మీ వాక్ చాతుర్యానికి, మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది.
 
ధనస్సు :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి.
 
మకరం :- బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త స్కీంలు, షాపుల అలంకరణలు చేపడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
కుంభం :- అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ఉల్లి, బెల్లం, పసుపు, కంది, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. స్త్రీలమనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. 
 
మీనం :- రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-10-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...