Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Advertiesment
daily astrology

రామన్

, శుక్రవారం, 16 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునేర్పులకు పరీక్షా సమయం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో రాణిస్తారు. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త ప్రదేశం, ఆలయాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మొండి బాకీలు వసూలవుతాయి. అయిన వారి కోసం ఖర్చు చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కొందరి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం శూన్యం. ఆలోచలతో సతమతమవుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. పుణ్యకార్యంలో పొల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వస్త్రప్రాప్తి ఉంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. పరిచయస్తులకు ధనసహాయం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలకపత్రాలు అందుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఎదుర్కుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. కార్యక్రమాలు సాగవు. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. అయిన వారే వ్యతిరేకులవుతారు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు సామాన్యం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
లక్ష్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. గత సంఘటనలు మరిచిపోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?