Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

Advertiesment
horoscope

రామన్

, గురువారం, 15 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషికి సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు, 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. కీలకపత్రాలు సమయానికి కనిపించవు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది, పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో అనుభం గడిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ చిత్తశుద్ధిపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతగా మెలగండి. పొరపాటున తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఆత్మస్థైర్యంతో శ్రమిస్తే విజయం తధ్యం. ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిఒత్తిడి, విశ్రాంతి లోపం, కార్యక్రమాలు ముందుకు సాగవు. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. ఖర్చులు విపరీతం. విందులకు హాజరవుతారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం