Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13-02-2024 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం...

anjaneya swamy

రామన్

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ చవితి రా.8.27 ఉత్తరాభాద్ర సా. 6.07 తె.వ.5.23 ల.
ఉ.దు. 8.50 ల 9.35 రా.దు 10.57 ల 11.48.
ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కొంత మంది మీ కదలికలపై నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
వృషభం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పెద్ద గురించి ఆందోళన చెందుతారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉండదు.
 
మిథునం :- ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలలోని వారు తప్పులు దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
సింహం :- సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
కన్య :- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. వాహనం నిదానంగా నడుపుటమంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తి నిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
తుల :- స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. బోగస్ ప్రకటనల వల్ల నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం :- వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను తెచుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు :- మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. పొగడ్తలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించడంవల్ల పనులు వాయిదావేసుకుంటారు.
 
మకరం :- రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. హామీలు, చెక్కులజారీల్లో ఏకాగ్రత వహించండి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళనలు అధికమవుతాయి.
 
కుంభం :- స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకులు కలిగిస్తుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. అలంకారాలు, వస్త్రాలు, విదేశీ వస్తువులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 14న వసంత పంచమి: విద్యార్థులు ఇలా చేస్తే?