Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

11-09-2024 బుధవారం దినఫలితాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

astrolgy

రామన్

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. రావలసిన ఆదాయం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. అవతలి వారి స్థోపత తెలుసుకోండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్తా శ్రవణం. మీ కష్టం వృధాకాదు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు పురమాయించవద్దు. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిర్మాణాలు, గృహమరమ్మతులు పూర్తవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. పెద్దల సలహా పాటిచంచండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు ఎదుర్కుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఒంటెద్దు పోకడ తగదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ నిజాయితీకి ప్రశంసలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. పత్రాలు అందుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. పెద్దల సలహా తీసుకుంటారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. రుణ సమస్య తొలగుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. పనుల్లో ఏకాగ్రత వహించండి. సోదరుల మాటతీరు అసహనం కలిగిస్తుంది. యోగ, ఆరోగ్య విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం అవసరం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-09-24 మంగళవారం దినఫలాలు - చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు...