Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-09-24 మంగళవారం దినఫలాలు - చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు...

Advertiesment
horoscope

రామన్

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (05:00 IST)
మేషం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారలు, సంతానంతో చికాకులు అధికమవుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం.
 
వృషభం :- నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. పాత రుణాలు తీరుస్తారు. సమయం సందర్భం లేకుండా విచ్చేసిన బంధువుల వల్ల అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది.
 
మిథునం :- ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. మీ పనులు, కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో ముందుకు సాగుతారు. వాహనం ఏకాగ్రతతో నడపటం ముఖ్యం. బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. ఖర్చులు మీ బడ్జెట్కు అనుగుణంగానే ఉంటాయి.
 
కర్కాటకం :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగల్గుతారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను సున్నితంగా వ్యక్తం చేయండి.
 
సింహం :- దైవ కార్యాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రముఖుల పరిచయాలతో మీ పలుకుబడి పెరుగుతుంది. మిమ్ములను ఆందోళనకు గురి చేసిన సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. పత్రికా సంస్థలలోనివారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. స్త్రీలకు పని భారం అధికం. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
కన్య :- మీ శ్రీమతితో అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. సౌమ్యంగా మెలిగి గృహ ప్రశాంతతను కాపాడుకోవాలి. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. రాబడికి మించి ఖర్చులుంటాయి, దుబారా ఖర్చులు నివారణ సాధ్యం కాదు.
 
తుల :- కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిశ్చింతకు లోనవుతారు. ఈ ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. త్వరలో కొన్ని సమస్య నుంచి బయట పడతారు. ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవు మంజూరవుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి.
 
వృశ్చికం :- పత్రికా,వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు తీర్పులు మీకే అనుకూలం. మిమ్ములను కలవరపరిచిన ఒక సమస్య అతి సునాయాసంగా పరిష్కారమవుతుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది.
 
ధనస్సు :- నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మకరం :- కొన్ని అనుకోని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూలత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకుమిశ్రమ స్త్రీలకు మోకాళ్ల నొప్పులు, దంత బాధలు ఎదుర్కోవలసి వస్తుంది. కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు అధికం. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
మీనం :- వాయిదా వేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి, పాత బకాయిలు వసూలు కాగలవు. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-09-24 సోమవారం దినఫలాలు - భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు ఫలిస్తాయి...