Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-09-2024 గురువారం దినఫలితాలు - ఆ రాశివారికి ఖర్చులు సామాన్యం..

Advertiesment
Weekly astrology

రామన్

, గురువారం, 5 సెప్టెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యతతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త పథకాలను అమలు చేస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఆత్మీయుల సలహా పాటిస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక చర్చల్లో తొందరపాటు తగదు. పెద్దల సంప్రదించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సాయం ఆశించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్త సమస్యలెదురవుతాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. కష్టమనుకున్న సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మస్థైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలయంలో వివాహాలు చేయడం మంచిదేనా?