Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

27-03-2021 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తే...

Advertiesment
April
, శనివారం, 27 మార్చి 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కారమవుతాయి. పరిశ్రమలకు, సంస్థల స్థాపనలకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీ ఆలోచనలు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. తరచూ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తుల సమర్తత, సమయస్ఫూర్తికి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 
 
మిథునం :  మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. భూముల క్రయ, విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. పారిశ్రామికరంగం వారికి ఊహించని చికాకులు లెదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిరాగలదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు శ్రమ అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, పనివారితో సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. పత్రికా రంగంలోనివారి ఏమరుపాటుతనం చిన్న చిన్న పొరపాట్లుదొర్లే ఆస్కారంవుంది. 
 
సింహం : ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. స్త్రీలకు గృహంలో ఒక శుభకార్యం చేయాలన్న ఆలోచన స్ఫురిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే అస్కారం ఉంది. మెళకువ వహించండి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ యత్నాలు త్వరలోనే ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మొమ్మాటం, ఒత్తిడి ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. ఖర్చులు అధికం. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్యసాధనలో జయం పొందుతారు. మీ సంతానం విద్యా, వివాహ, ఉద్యోగ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ఆలయ సందర్శనాలలో మెళకువ అవసరం. 
 
వృశ్చికం : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిదికాదని గమనించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులకు ఆత్మస్థైర్యం, ఏకాగ్రత ఏంతో ముఖ్యం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. శ్రమ కొంతమేరకు ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కళాకారులకు నూతనోత్సాహం కానవస్తుంది. ప్రత్యర్థుల ఎత్తుగడలకు సమర్థంగా ఎదుర్కొంటారు. 
 
మకరం : పోగొట్టుకున్న వస్తువులను తిరిగి దక్కించుకుంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తికాకపోవడంతో ఒకింత అసహనానికి లోనవుతారు. విదేశీ పర్యటనలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు వింటారు. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాపరుస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని పరిస్థితులు ఆనందం కలిగిస్తాయి. మీ వృత్తికి సంబంధించి అనుకూలమైన సమయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. పనులు నెమ్మదిగా పూర్తికాగలవు. 
 
మీనం : ఆర్థిక పరిస్థితి గతం అంటే మెరుగుగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మానసికంగా కాస్త ఇబ్బందిపడతారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోతారు. అవసరానికి ధనం చేతికందుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-03-2021 - శుక్రవారం మీ రాశి ఫలితాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల...?