Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అ ఆ', 'భీష్మ`‌, 'రంగ్ దే`తో ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీగా వుందిః నితిన్‌.

Advertiesment
'అ ఆ', 'భీష్మ`‌, 'రంగ్ దే`తో ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీగా వుందిః  నితిన్‌.
, శుక్రవారం, 26 మార్చి 2021 (18:50 IST)
నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'రంగ్ దేస‌. చ‌క్క‌ని నిర్మాణ విలువ‌ల‌తో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్ర‌వారం (మార్చి 26) విడుద‌లై అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ టాక్‌తో విజ‌య‌ప‌థం వైపు దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సంస్థ కార్యాల‌యంలో స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నితిన్‌, డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ పాల్గొన్నారు. ముందుగా వారు చిత్ర విజ‌యాన్ని పుర‌స్క‌రించుకొని బాణ‌సంచా కాల్చి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.‌
 
హీరో నితిన్ మాట్లాడుతూ, "సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. మూవీలోని ఫ‌న్‌, ఎమోష‌న్స్‌ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కీర్తి క్యారెక్ట‌ర్‌, నా క్యారెక్ట‌ర్ బాగా న‌చ్చాయంటున్నారు. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా న‌చ్చిందంటున్నారు. డీఎస్పీ, పీసీ శ్రీ‌రామ్ ప‌నిత‌నం బాగుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. అన్ని ప్లేస్‌ల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం హ్యాపీ. 'రంగ్ దే'ను ఆద‌రిస్తున్న అంద‌రికీ థాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సంస్థ‌లో నాకు ఇది మూడో సినిమా. ఇదివ‌ర‌కు నేను చేసిన 'అ ఆ', 'భీష్మ' బాగా ఆడాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ రావ‌డం సంతోషంగా ఉంది. 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' మూవీ త‌ర్వాత ఆ జాన‌ర్‌లో నేను చేసిన సినిమా ఇది. హీరో క్యారెక్ట‌ర్ చేంజ్ అయ్యే సీన్లు అంద‌రికీ బాగా న‌చ్చుతున్నాయి. వ్య‌క్తిగ‌తంగా నాకూ అవి న‌చ్చాయి. కీర్తి గొప్ప న‌టి. అను పాత్ర‌ను చాలా బాగా చేసింది. మేమిద్ద‌రం 'రంగ్ దే' క‌థ‌ను బాగా న‌మ్మాం. అది మా ఇద్ద‌రి మ‌ధ్య సీన్ల‌లో రిఫ్లెక్ట్ అయ్యి, బాగా వ‌చ్చాయ‌నుకుంటున్నా. మార్నింగ్ షో కంటే మ్యాట్నీకి క‌లెక్ష‌న్లు ఇంప్రూవ్ అయ్యాయి. షోకి షోకీ క‌లెక్ష‌న్లు పెరుగుతుండ‌టం హ్యాపీ. వీకెండ్ నాటికి మ‌రింత బాగా క‌లెక్ష‌న్లు వ‌చ్చి, బ‌య్య‌ర్లంద‌రూ హ్యాపీగా ఉంటార‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం." అన్నారు
 
గుడ్ న్యూస్‌తో నిద్ర‌లేచాం.
డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "ఎగ్జామ్స్ రాసి, ఈ రోజు రిజ‌ల్ట్ కోసం ఎదురుచూశాం. రిజ‌ల్ట్ బాగా వ‌చ్చినందుకు చాలా హ్యాపీ. అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ వైబ్స్ వ‌స్తున్నాయి. ముందుగా ఓవ‌ర్సీస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. ఈరోజు పొద్దున్నే గుడ్ న్యూస్‌తో నిద్ర‌లేచాం. హీరో హీరోయిన్లు నితిన్‌, కీర్తి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, డీఓపీ పీసీ శ్రీ‌రామ్ 'రంగ్ దే'కు నాలుగు మూల స్తంభాలుగా నిలిచారు. అర్జున్‌, అను పాత్ర‌ల్లో నితిన్‌, కీర్తి వండ‌ర్‌ఫుల్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. దేవి బ్యూటిఫుల్ ఇస్తే, పీసీ గారు త‌న కెమెరాతో సూప‌ర్బ్ ఔట్‌పుట్ ఇచ్చారు. ఈ సినిమాతో నాకింత మంచి అవ‌కాశాన్నిచ్చిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కు రుణ‌ప‌డి ఉంటాను. ఈ బ్యాన‌ర్‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటున్నాను. డైలాగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీ. అయితే ఆ క్రెడిట్‌ నాకంటే వాటిని చెప్పిన అంత బాగా చెప్పిన ఆర్టిస్టుల‌కే ద‌క్కుతుంది. సినిమాలో ఓ పార్ట్ ఫారిన్‌లో జ‌రగ‌డం అనేది నా సినిమాల్లో కోఇన్సిడెన్సే త‌ప్ప‌, సెంటిమెంట్‌గా చేస్తోంది కాదు. మొద‌ట ఈ సినిమాకు ఇట‌లీని బ్యాక్‌డ్రాప్‌గా అనుకున్నాం కానీ, కొవిడ్ వ‌ల్ల అక్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో, బ్యాక్‌డ్రాప్‌ను దుబాయ్‌గా మార్చాం. ఆ సీన్స్ బాగా వ‌చ్చాయి, ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చాయి." అన్నారు.
 
నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ మాట్లాడుతూ, "సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. అంద‌రూ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అంద‌రి కంటే ముందుగా మీడియా ప‌ర్స‌న్స్ ఫోన్ చేసి సినిమా బాగా న‌చ్చింద‌నీ, ఎంట‌ర్టైన్‌మెంట్‌, ఎమోష‌న్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల‌య్యాను. మార్నింగ్ షోతో పోలిస్తే, మ్యాట్నీకి క‌లెక్ష‌న్లు ఇంప్రూవ్ అవ‌డం, ఫ‌స్ట్ షోకు ఇంకా పెర‌గ‌డం ఆనందంగా ఉంది. మునుముందు క‌లెక్ష‌న్లు ఇంకా పెరిగి, సినిమాని ప్రేక్ష‌కులు పెద్ద హిట్ చేస్తార‌ని ఆశిస్తున్నాం." అన్నారు.
అనంత‌రం సినిమా విజ‌యానికి సంకేతంగా హీరో నితిన్ కేక్ క‌ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"లవ్ స్టోరీ" నుంచి 'ఏవో ఏవో కలలే'... మహేష్ చేతుల మీదుగా రిలీజ్ (Video)