Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-02-2021 శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని ఎర్రని పూలతో పూజించినా..

Advertiesment
Daily Horoscope
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (04:00 IST)
మేషం : ఆదాయానికి తగినట్టుగా ధన వ్యయం చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమించాలి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి శుభదాయకంగా ఉంటుంది. మితంగా సంభాషిస్తూ మీ ప్రత్యర్థుల జోరును పెరగకుండా చూడండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. 
 
వృషభం : శత్రువులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. భాగస్వామియక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల మితమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పెరిగిన పోటీ వాతవరణం వల్ల వారి టారగెట్‍కు భంగం వాటిల్లుతుంది. ఒకే అభిరుచి కలిగన వ్యక్తుల కలయిక జరుగును. 
 
కర్కాటకం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహాకారం వల్ల సమసిపోగలవు. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగతుంది. అతిథి మర్యాదలు బాగాగా నిర్వహించగలుగుతారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. 
 
సింహం : వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ప్రశాంతంగా కొనసాగుతాయి. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. 
 
కన్య : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మాట్లాడలేనిచోట మౌనం వహించండి. మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రుణ విముక్తి, తాకట్టు విడిపించుకోవడం వంటి శుభఫలితాలు ఉంటాయి. 
 
తుల : రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
వృశ్చికం : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
ధనస్సు : రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 
 
మకరం : దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్య సేవలు అవసరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
కుంభం : గత తప్పిదాలు పునరావృతం అయ్యే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. 
 
మీనం : మీ ఆలోచనలు, కుటుంబ పరిస్థితులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. స్త్రీలకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు, అవసరాలు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాఘమాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు చేస్తే..?