Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-02-2021 గురువారం రాశిఫలాలు : నవగ్రహ స్తోత్ర పారాయణం చేసినా...

Advertiesment
Daily Horoscope
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (04:00 IST)
మేషం : స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. 
 
వృషభం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధన వ్యయంలో మితం పాటించండి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉందు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగులు గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల వల్ల ఇక్కట్లు ఎదురవుతాయి. ఖాతాదారులు, క్లయింట్లతో సంబంధాలు బలడతాయి. 
 
సింహం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. షాపు గుమస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం వంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. 
 
కన్య : ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అదికమవుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీల పేరిట స్థిరాస్తుల కొనుగోళ్లు లాభిస్తాయి. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించడానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. 
 
తుల : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. నిరుద్యోగులకు ఎటువంటి సదావకాసం లభించినా సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు, అధికారిక పర్యటనలు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఆదాయ వ్యయాలు మీ అచంనాలకు భిన్నంగా ఉంటాయి. ఒకరికి సహయం చేసి మరొకరికి ఆగ్రహానికి గురవుతారు. కిరాణా, ప్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసివస్తుంది. పత్రికా, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. 
 
ధనస్సు : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. దైవదర్శనాలు, అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వాస్తుకు అనుగుణంగా గృహ మార్పులుచేపడతారు. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
మకరం : వృత్తులవారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యములు దాచినందుకు కలహాలు తప్పవు. 
 
కుంభం : స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికమవుతుంది. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్ల శ్రమకు, తిప్పట తప్పవు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. 
 
మీనం : శారీరక శ్రమ, నిద్రలేమి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు మంచిదికాదు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ భక్తుడు విరాళం .. రూ.2 కోట్ల విలువ చేసే శంఖుచక్రాల కానుకలు