Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

11-02-2021 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయ స్వామిని ఆరాధించినా..

Advertiesment
Daily Horoscope
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (05:00 IST)
మేషం : వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఒక సమస్య పరిష్కారం కావడంతో కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో హడావుడిగా ఉంటారు. 
 
వృషభం : ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వాదాపవాదాల్లో ఫ్లీడర్లకు చికాకులు, నిరుత్సాహం తప్పదు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మిథునం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు పొందుతారు. ప్రముఖుల సహకారం లభిస్తుంది. ఒక శుభకార్యానికి ముమ్మరంగా యత్నాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయానికి ఇంటా బయటా వ్యతిరేక ఎదురవుతుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. వాహన చోదకులకు చికాకులు అధికం. 
 
సింహం : ప్రముఖుల ఇంటర్వ్వూ కోసం అధిక సమయం వేచివుండక తప్పదు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. షేర్ల క్రయ, విక్రయాలు లాభిస్తాయి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పిదం చేస్తారు. 
 
కన్య : హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రైవేట్ ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో చికాకులెదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. 
 
తుల : ప్రముఖుల కలయికతో ముఖ్యమైన పనులు సానుకూలమవుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : పత్రికా సిబ్బంది మార్పుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు యత్నిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
ధనస్సు : మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మకరం : విద్యార్థినిలకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. 
 
కుంభం : స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ఇతరుల ముందు మీ కుటుంబ విషయాలు ఏకరవు పెట్టడం మంచిదికాదు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు పొందుతారు. 
 
మీనం : గృహోపకరణాలు అమర్చుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. రాబోయే ఖర్చులకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి క్షేత్ర వైభవాన్ని తెలిపే టేబుల్ బుక్.. ఎలా ఉంటుందంటే?