Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

08-02-2021 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడుని పూజించినా...

08-02-2021 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడుని పూజించినా...
, సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (05:00 IST)
మేషం : మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. పారిశ్రామికరంగాల వారికి ఆశాజనకం. 
 
వృషభం : భాగస్వామిక చర్చలు, ప్రముఖులతో మంతనాలు ప్రశాంతంగా ముగుస్తాయి. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికం. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. 
 
మిథునం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. మీ మించి కురోకునవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు దైవ దర్శనాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
సింహం : మీకదలికలు, స్థితిగతులపై కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. ఎదుటివారి విషయాల్లో అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో మెళకువ అవసరం. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారుకు ఆశాజనకం. 
 
తుల : మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఏదేనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. వైద్యులకు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఫ్లీడరు, ఫ్లీడరు గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాలవారికి ఆశాజనకం. 
 
వృశ్చికం : సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిట్స్, ప్రైవేటు ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు, అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
ధనస్సు : భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, సమర్థంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందడంతో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరుకావడంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
మకరం : ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 
 
కుంభం : స్టేషనరీ, ప్రింటింగు రంగాలలో వారికి అనుకూలం. స్త్రీలకు తన, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. బ్యాంకు పనులు అనుకూలం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 
 
మీనం : అర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. మీ కోపాన్ని చిరాకును ఎక్కువా ప్రదర్శించడం మంచిది కాదు. ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-02-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు-సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే