Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-02-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల...

Advertiesment
02-02-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల...
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (04:00 IST)
మేషం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. ప్రేమికులకు ఓర్పు, సంయమనం చాలా అవసరం. విద్యార్థినులు కొత్త విషయాల పట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనబరుస్తారు. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం : స్త్రీలకు స్వీయ అర్జన, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్ మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. 
 
మిథునం : శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు, అధికారులు, ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. మిత్రుల విషయంలో మీ ఊహలు నిజమవుతాయి. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. ఒక వ్యవహారంలో సోదరుల నుంచి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
సింహం : ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి. భాగస్వామికుల మధ్య ఏకాభావం లోపిస్తుంది. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
కన్య : తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మెళకువ వహించండి. కిరాణా, ఫ్యాన్సీ పండ్లు, పూల వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. హమీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
తుల : కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి లాభదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
వృశ్చికం : పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. నూతన పరిచయాలేర్పడతాయి. హోటల్, తినుబండ వ్యాపారులకు, కేటరింగ్ రంగాల వారికి ఆశాజనకం. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థినులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. 
 
ధనస్సు : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ముందుగా ఊహించిన ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
మకరం : వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవడంతో కుటుంబ సౌఖ్యం అంతగా ఉండవు. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతా రహితంగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో పనివారితో లౌక్యం అవసరం.
 
మీనం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-02-2021 నుంచి 28-02-2021 వరకూ ఫిబ్రవరి రాశి ఫలితాలు