Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-01-2021 శనివారం దినఫలాలు - నారాయణ స్వామిని పూజించిన సంకల్పసిద్ధి

Advertiesment
30-01-2021 శనివారం దినఫలాలు - నారాయణ స్వామిని పూజించిన సంకల్పసిద్ధి
, శనివారం, 30 జనవరి 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. 
 
వృషభం : ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. కంప్యూటర్, ఎలక్ట్రానికి రంగాల వారికి మిశ్రమ ఫలితం. బ్యాంకు పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. ఏకాంతం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం : బ్యాంకు వ్యవహారాలు హడావుడిగా పూర్తిచేస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్థులు క్రీడా పోటీల పట్ల ఆసక్తి చూపుతారు. తలచిన కార్యాల్లో జాప్యం. అధికమైన ఖర్చులను ఎదుర్కొంటారు. భాగస్వాముల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువుల రాక, కలయిక ఆనందాన్నిస్తుంది. 
 
కర్కాటకం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. క్రమేణా రుణాలు తీరుస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్నిసాధిస్తారు.
 
సింహం : కిరాణా, ఫ్యాన్సీ, మందులు రసాయ సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికమవుతాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. 
 
కన్య : సంతకాలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు తలపెట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వృత్తి పనుల వారికి ఆదాయం బాగుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రుణ విముక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. 
 
తుల : ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పూర్వ విద్యార్థుల కలయికతో గత అనుభూతులు గుర్తుకువస్తాయి. ధనం అందుకుంటారు. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. పత్రికా సంస్థలలోని వారికి చిన్నచిన్న తప్పిదారుల దొర్లే సూచనలున్నాయి. 
 
వృశ్చికం : చేపట్టిన పనుల్లో స్వల్ప చికాకులు ఎదుర్కొంటారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకు డిపాజిట్ల సొమ్ము ముందుగానే తీసుకోవలసి వస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 
 
ధనస్సు : కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారికి నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. 
 
మకరం : ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఆందోళన చెందుతారు. బెట్టింగులు, జూదాలు వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శక్తి సామర్థ్యాలు, నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. లాయరు నోటీసు ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనపరుస్తారు. 
 
కుంభం : ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్థులకు కలిసిరాగలదు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మీనం : స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వాహనం ఏకాగ్రతతో నపడటం క్షేమదాయకం. ఫ్లీడర్లకు, తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు విరబోసుకుని శుక్రవారం పూజ చేస్తే..?