Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం

Advertiesment
YV Subbareddy
, బుధవారం, 11 ఆగస్టు 2021 (11:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

కాగా టీటీడీ ఛైర్మన్‌గా ఆయనకు మరోసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో టీటీడీ బోర్డు సభ్యులను నియమిస్తామని ఇటీవల ప్రకటించింది.  2019 జూన్‌ 21న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు.

అదే ఏడాది సెప్టెంబర్‌లో 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 21వ తేదీకి ముగిసింది. దీంతో టీటీడీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి: సీపీఐ రామకృష్ణ