Publish Date: Thu, 11 Dec 2025 (13:37 IST)
Updated Date: Thu, 11 Dec 2025 (13:40 IST)
కడప మేయర్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరంగా వుంది. దీంతో కడప మేయర్ పదవిని వైసీపీ చేజిక్కించుకుంది. కడప కార్పొరేషన్ మేయర్‌గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మాజీ మేయర్ సురేష్ బాబును తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. కడప కార్పొరేషన్‌లో మొత్తం 50 మంది కార్పొరేటర్లుండగా అందులో 49 మంది వైసీపీ నుంచి గెలిచారు.
కానీ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఎనిమిది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. టీడీపీకి ఎనిమిది మంది, వైసీపీకి నలభై రెండు మంది కార్పరేటర్లున్నారు. అందులో ఇద్దరు కార్పొరేటర్లు మరణించారు. అయినా వైసీపికి బలం ఉండటంతో టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో పాకా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.