Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జంప్ జిలానీల్లో నలుగురికి చంద్రబాబు చోటు... జ్యోతుల నెహ్రూ - జలీల్‌ ఖాన్‌లకు మొండి

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి నలుగురు జంప్ జిలానీలకు చోటు కల్పించారు. విపక్ష వైఎస్ఆర్ సీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు తన మంత్రివర

Advertiesment
జంప్ జిలానీల్లో నలుగురికి చంద్రబాబు చోటు... జ్యోతుల నెహ్రూ - జలీల్‌ ఖాన్‌లకు మొండి
, ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (10:26 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి నలుగురు జంప్ జిలానీలకు చోటు కల్పించారు. విపక్ష వైఎస్ఆర్ సీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇపుడు చర్చనీయాంశమైంది. 
 
ఈ నలుగురులో సుజయకృష్ణ రంగారావు (విజయనగరం), అమర్‌నాథ్ రెడ్డి (చిత్తూరు), ఆదినారాయణ రెడ్డి (కడప), భూమా అఖిలప్రియ (కర్నూలు)లు వీరిలో ఉన్నారు. జ్యోతుల నెహ్రూ, జలీల్‌ ఖాన్‌, చాంద్‌బాషా, డేవిడ్‌రాజు వంటి వారి పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా ఇంతకుమించి ఇవ్వడం సాధ్యం కాదన్న యోచనతో పక్కనపెట్టారు. వీరింతా కూడా వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చిన వారే. 
 
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి అధికారిక తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తున్న చంద్రబాబు.. తన సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారికి మంత్రి పదవులు కేటాయించడం గమనార్హం. 
 
ఇదిలావుండగా, చంద్రబాబు మంత్రివర్గంలో శాసనమండలి నుంచి నలుగురు మంత్రులు అయ్యారు. గతంలో యనమల రామకృష్ణుడు, నారాయణ ఉండగా... తాజాగా లోకేశ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు కొత్తగా వచ్చారు. మండలి నుంచి మరికొందరి పేర్లు ప్రతిపాదనకు వచ్చినా ఎమ్మెల్యేల నుంచి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలన్న యోచనతో ఇంతవరకే పరిమితం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్‌కి, తండ్రికి లోకేశ్ పాదాభివందనం.. తరలి వచ్చిన నందమూరి కుటుంబం