Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గవర్నర్‌కి, తండ్రికి లోకేశ్ పాదాభివందనం.. తరలి వచ్చిన నందమూరి కుటుంబం

ఆదివారం ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరింది. తొలుత కళా వెంకట్రావు, ఆ తర్వాత నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చే

Advertiesment
గవర్నర్‌కి, తండ్రికి లోకేశ్ పాదాభివందనం.. తరలి వచ్చిన నందమూరి కుటుంబం
హైదరాబాద్ , ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (10:07 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురిని తొలగించి.. కేబినెట్‌లోకి కొత్తగా 11 మందిని తీసుకున్నారు. ఆదివారం ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరింది. తొలుత కళా వెంకట్రావు, ఆ తర్వాత నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత లోకేశ్.. చంద్రబాబుకు, గవర్నర్ నరసింహన్‌కు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. 
 
లోకేశ్‌తో పాటు కిమిడి కళా వెంకట్రావు (శ్రీకాకుళం), సుజయకృష్ణ రంగారావు (విజయనగరం), పితాని సత్యనారాయణ (ప. గోదావరి), జవహర్‌ (పశ్చిమ గోదావరి), నక్కా ఆనందబాబు (గుంటూరు), సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి (నెల్లూరు), అమర్‌నాథ రెడ్డి (చిత్తూరు), కాల్వ శ్రీనివాస్‌ (అనంతపురం), ఆదినారాయణ రెడ్డి (కడప), భూమా అఖిలప్రియ (కర్నూలు) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రముఖులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
 
ఊహించినట్టుగానే చంద్రబాబు కొడుకు నారా లోకేశ్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయన ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు చంద్రబాబు కేబినెట్‌లో బెర్తులు దక్కాయి. వీరితో పాటు నక్కా ఆనంద్‌బాబు, పితాని సత్యనారాయణ, కొత్తపల్లి జవహర్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణలో ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇస్తారని ముందు నుంచి వార్తలు రాగా.. ఆమెతో పాటు అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు మంత్రి పదవులు దక్కాయి. 
 
మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు. కేబినెట్‌ నుంచి ఇద్దరు మహిళలను తొలగించి విస్తరణలో ఒక్కరికే అవకాశం ఇచ్చారు. గిరిజనులకు, మైనార్టీలకు చోటు దక్కలేదు.  మంత్రి వర్గ విస్తరణపై టీడీపీలో అసంతృప్తి రాజుకుంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కేబినెట్‌ నుంచి ఉద్వాసనకు గురైనవారు, మంత్రి పదవులు ఆశించి అవకాశంరాని సీనియర్లు రగిలిపోతున్నారు. టీడీపీ నేతలు వీరిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.  
 
మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నందమూరి, నారా వారి కుటుంబాలు నిలిచాయి. మంత్రిగా లోకేశ్ ప్రమాణ స్వీకారానికి నందమూరి హరికృష్ణ, తారకరత్న, కళ్యాణ్‌రామ్‌, నారా రోహిత్‌, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్‌ తదితరులు విచ్చేశారు. దీంతో కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వీరిని చూసేందుకు ఎగబడ్డారు. అమరావతికి ప్రత్యేక బస్సులో వీరందరూ అమరావతికి వచ్చారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వీరిని చూసేందుకు తోసుకొచ్చారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రసృష్టించిన భూమా అఖిలప్రియ... జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు!