Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

Advertiesment
shankar naik

ఠాగూర్

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (08:49 IST)
విజయవాడ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహంలో వైకాపా నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. ఈ గృహంలో వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసలకు వచ్చిన సమాచారం మేరకు ఆ గృహంలో పోలీసులు తనిఖీలు చేశారు. గదిలోకి వచ్చిన పోలీసులకు మహిళ మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి గదిని గాలించగా, మంచం  కింద దాక్కున్న శంకర్ నాయక్‌ కనిపించారు. 
 
విద్యార్థులు కష్టాలు తీరుస్తా, గిరిజనులకు అండగా ఉంటా, ఉద్యమాలు చేస్తా అంటూ తరుచూ హడావుడి చేసే శంకర్ నాయక్ ఇలా వ్యభిచారం గృహంలో అడ్డంగా బుక్ కావడంతో అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైకాపా నేతలంతా మంచివాళ్లు, సౌమ్యులు, అందగాళ్లంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం కామాంధులుగా మారిపోయి పోలీసులు ఇలా అడ్డంగా చిక్కుతున్నారు. 
 
చలసాని భార్గవ్ అనే వ్యక్తి విజయవాడ గురునానక్ కాలనీలో స్టూడియో 09 పేరుతో ఓ స్పా సెంటర్ నడుపుతున్నాడు. పేరుకు స్పా సెంటరే కానీ, లోపల జరిగేదంతా హైటెక్ వ్యభిచారం ఈ కేంద్రంపై రెండు నెలల కిందట కూడా పోలీసులు దాడులు చేశారు కానీ, ఆ సమాచారం తెలిసి నిర్వాహకులు అప్రమత్తమైపోతారు. 
 
తాజాగా వీడియో ఆధారాలతో సహా ఇక్కడ జరుగుతున్న వ్యవహారంపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం రాత్రి మాచవరం పోలీసులు సోదాలు చేశారు. ఓ గదిలో మంచ కింద వైకాపా నేత శంకర్ నాయక్ దొరికారు. బయటకు రమ్మని పోలీసులు సూచించినా రాకపోవడంతో వాళ్లే లాగి తీసుకొచ్చారు. తనను వదిలేయాలంటూ తిరిగి పోలీసులపైనే జులుం ప్రదర్శించినట్టు తెలిసింది. ఈ కేసులో శంకర్ నాయక్‌ను ఏ10గా నమోదు చేశారు. 
 
వైకాపా అధినేత జగన్‌కు శంకర్ నాయక్ అత్యంత సన్నిహితుడు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకర్ నాయక్ ఈ నెల 9వ వరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడుగా కొనసాగారు. ఈ సమయంలో ఎక్కడ ఏ వివాదం జరిగిన అక్కడ ప్రత్యక్షమై, అధికారులు, పోలీసులను బెదిరిస్తూ తాను చెప్పినట్టు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేసేవారు. అట్రాసిటీ కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగేవారనే విమర్శలు ఉన్నాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!