పీఆర్సీ సమస్య శనివారం జరిగే మంత్రుల కమిటీ చర్చలతో పరిష్కారం అయ్యేలా వుంది. ఇందుకు కారణం వైకాపా మంత్రులు ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించడమే.
తాజాగా మంత్రి బొత్స, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇప్పటికే ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయని.. నేటి భేటీతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు బొత్స. ఐఆర్‌పై స్పష్టత ఇచ్చాం. ప్రభుత్వంపై 6వేల కోట్ల భారం పడొచ్చు. మిగిలినవన్నీ చిన్న చిన్న సమస్యలే. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స అన్నారు.