Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని అసెంబ్లీ ఎదుట చెవిరెడ్డి దీక్ష…

విజయవాడలోని రవాణాశాఖ కార్యాలయ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసిన కేసులో టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసులు నమోదు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌

Advertiesment
YSR Congress Party
, సోమవారం, 27 మార్చి 2017 (11:03 IST)
విజయవాడలోని రవాణాశాఖ కార్యాలయ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసిన కేసులో టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసులు నమోదు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఎదుట దీక్షకు దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే చంద్రబాబు, వారి నేతలు తప్పులు చేసినా కేసులు పెట్టకుండా పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ మీ పార్టీకి చెందినవాళ్లయితే కేసులు ఉండవా? టీడీపీ నేతలు ఎన్ని అరాచకాలు చేసిన కేసులు ఎందుకు పెట్టడం లేదంటూ ఆయన నిలదీశారు. చట్టం, న్యాయం అందరికీ ఒకేలా ఉండవా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్యాయమైన పాలనే కాదు, తాలిబాన్ల నడుస్తోంది మండిపడ్డారు. 
 
ఐపీఎస్ అధికారిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, చర్యలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ దీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు తమ మద్దతును తెలిపారు. అయితే, పోలీసులు రంగ ప్రవేశం చేసి చెవిరెడ్డి దీక్షను భగ్నం చేసి బలవంతంగా వ్యానులో ఎక్కించి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు రౌడీలా.. ప్రజా ప్రతినిధులా? పార్టీని నాశనం చేస్తున్నారు.. టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్