Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు రౌడీలా.. ప్రజా ప్రతినిధులా? పార్టీని నాశనం చేస్తున్నారు.. టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్

విజయవాడ ఆర్టీఓ కార్యాలయ అధికారులపై దౌర్జన్యం చేసి దాడి చేసిన సొంత పార్టీ ప్రజా ప్రతినిధులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీరంతా.. రౌడీలా... లేక ప్రజా ప్రతినిధులా? మీకు జగన్‌కు ఉన్న తేడా

మీరు రౌడీలా.. ప్రజా ప్రతినిధులా? పార్టీని నాశనం చేస్తున్నారు.. టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్
, సోమవారం, 27 మార్చి 2017 (10:47 IST)
విజయవాడ ఆర్టీఓ కార్యాలయ అధికారులపై దౌర్జన్యం చేసి దాడి చేసిన సొంత పార్టీ ప్రజా ప్రతినిధులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీరంతా.. రౌడీలా... లేక ప్రజా ప్రతినిధులా? మీకు జగన్‌కు ఉన్న తేడా ఏంటి? అంటూ ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 
 
ఏపీ ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ అంశంలో విపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. కేశినేని నాని, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరాను తన కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నారు. తక్షణమే ఆర్టీఏ కమిషనర్‌, సిబ్బందికి క్షమాపణ చెప్పాలని సూచించారు. 
 
పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్‌ తీసుకోవడంతో టీడీపీ నేతలు నేరుగా రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు క్షమాపణలు చెప్పారు. మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. శనివారం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. సీఎం సూచన మేరకు కమిషనర్‌కు విచారం వ్యక్తం చేశామని, తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు. ఉద్యోగులపై దాడితో ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం అన్నారు. 
 
ప్రజలకు సేవ చేయాలని చెప్పే ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడటం మంచిదికాదన్నారు. టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పడంతో.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నామన్నారు. మొత్తానికి టీడీపీ నేతల క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను పని రాక్షసుడిని.. కష్టపడి పని చేయడి లేదా రాజీనామాలు చేసి ఇంటికెళ్లండి: సీఎం యోగి