Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

Advertiesment
yssharmila

ఠాగూర్

, మంగళవారం, 7 మే 2024 (14:24 IST)
మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల మేరకు చేతులు మారాయని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఫోన్ రికార్డుతో పాటు డబ్బులు చేతులు మారాయని సక్ష్యాలు ఉన్నా కూడా ఐదేళ్లుగా ప్రభుత్వం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. వాస్తవానికి సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలు సేకరించేదాకా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందనే విషయం తమకు తెలియదని తెలిపారు. 
 
ఈ హత్యలో అవినాశ్ పాత్ర ఉందని తెలిశాక, హత్య జరగడానికి ముందు, ఆ తర్వాత ఆయన ఎవరికి ఫోన్ చేశారనే వివరాలూ బయటకొచ్చాయని షర్మిల వివరించారు. ఇంత స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నప్పటకీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వివేకా హత్య జరిగాక ఘటనా స్థలంలో ఆధారాలు తుడిచేస్తుంటే అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోవడం వెనుక కారణాలేంటని షర్మిల ప్రశ్నించారు. 
 
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని ఎన్నికల్లో ప్రస్తావించరాదంటూ కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, షర్మిల మాత్రం ఈ ఆదేశాలను ఉల్లంఘించి వివేకా హత్య కేసును పదేపదే ప్రస్తావిస్తున్నారంటూ వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ నెల 2వ తేదీ బద్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. 
 
బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్