ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. అలాగే ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ స్తంభాలు సైతం దెబ్బతిన్నాయని చెప్పారు.ప్రకాశం బ్యారేజీకి ఎంతో ఘన చరిత్ర ఉందని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. అలాంటి బ్యారేజీ గేట్లు విరిగి పోయిన అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించకుంటే.. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, బ్యారేజీలకు వార్షిక నిర్వహణ కూడా చేపట్టలేదని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మండిపడ్డారు.